11 June, 2026 | 1:20 AM

యూరియా కొరత తీర్చాలి

11-06-2026 12:11 AM

ఎంపీ డీకే అరుణకు కాంగ్రెస్ వినతి

షాద్‌నగర్, జూన్ 10 (విజయక్రాంతి): సాగు సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా ఎరువులను తగినంతగా అందుబాటులో ఉంచాలని కోరుతూ మహబూబ్న గర్ ఎంపీ డీకే అరుణకు చౌదరిగూడ మండ ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని చౌదరిగూడ మండల పర్యటనకు వచ్చిన ఎంపీని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖ ర్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు వాడుతున్న యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, కేంద్ర ప్రభు త్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.వ్యవసాయ పనులు జోరందుకున్న తరుణంలో గ్రామాల్లో ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చలివేంద్రంప ల్లి రాజు, జంగయ్య, నీలయ్య, బాలరాజు, సలీం, నర్సింలు, యాదయ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.