18 April, 2026 | 2:42 AM

కాళేశ్వరంలో మంత్రి తుమ్మల పవిత్ర పుణ్యస్నానం

17-05-2025 12:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. దీంతో సరస్వతి పుష్కర ఘాట్ వద్ద పుష్కర స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. శనివారం సరస్వతి పుష్కారాల కోసం కాళేశ్వరం వెళ్లిన తుమ్మల పుష్కరఘాట్ లోని త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు.

సాయంత్రం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  గోదావరి హారతి కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో పుష్కర ఘాట్ వద్ద పుష్కర స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సరస్వతి ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్నారు. కాళేశ్వరం నుంచి మహదేవ్ పూర్ మధ్యలో 5 కిలో మీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.