3 March, 2026 | 3:10 AM

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల

03-03-2026 01:32 AM

బంధువుల వైద్యం కోసం ఐదు రోజుల క్రితమే దుబాయ్‌కి..

రద్దయిన విమానలు ప్రారంభం అయ్యేంతవరకు అక్కడే ఉండనున్న తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2 (విజయక్రాంతి): అమెరికా, ఇజ్రాయిల్ కూటమి, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయిలో చిక్కుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవడంతో వైద్యం కోసం ఐదు రోజుల క్రితం దుబాయ్ చేరుకున్నారు.

ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్న క్రమంలో యుద్ధం ఉధృతం కావడంతో బయటకు రాలేకపోయారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో మంత్ర తుమ్మల నాగేశ్వరరావు ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేకుండా పోయింది. దుబాయ్ విమానాశ్రయంపై సైతం ఇరాన్ డ్రోన్లు బాంబులు, క్షిపణులు పడటంతో దాన్ని కూడా మూసివేశారు. రెండు భవనాలను అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. తెలంగాణ మంత్రితోపాటు, ప్రవాస ఆంధ్రులు, తెలంగాణ ప్రజలు చిక్కుకున్నారు. దుబాయ్ నుంచి విమానాలు ప్రారంభం అయ్యేంతవరకు మంత్రి ఇండియాకు వచ్చే అవకాశాలు లేవు.