3 March, 2026 | 3:12 AM

ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలుకే రాహుల్ రాక

03-03-2026 01:32 AM

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): ఆర్‌ఆర్ (రాహుల్ గాంధీ- ట్యా క్స్ వసూలు చేసుకోవడానికే పక్కా ప్లాన్‌తో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీకి నిజంగా తెలంగాణ ప్రజల సమస్యలపై క నీస అవగాహన, ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రాగానే మొదట వాటి అమలుపై సమీక్షించేవారు.

హామీలు ఎలా అమలు అవుతున్నాయని తెలుసుకునే ప్ర యత్నం చేసేవారు. కానీ, ఇసుమంతైనా జవాబుదారీతనంలేని రాహుల్ గాంధీ నుం చి ఇలాంటివి ఆశించడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని తెలిపారు. అందుకే తెలంగాణ పర్యటనలో.. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలపై రాహుల్ గాంధీ ఊ సెత్తలేదన్నారు. తనకు మతిమరుపు ఉం దేమో కానీ..

తెలంగాణ ప్రజలకు లేదనే విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలతో చేసిన గోబెల్స్ ప్రచారం.. ఎన్నికల్లో గెలిచాక ము ఖం చాటేసి, మీరు చేసిన మోసానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబు తారని ఆయన హెచ్చరించారు.