పద్ధతి ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రూ.37 కోట్లు విడుదల చేశాం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... బ్రాహ్రణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు రూ. 37 కోట్లు విడుదల చేశామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు ఈ వారంలో రూ. 22 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. అన్ని ప్రాజెక్టులు పద్ధతి ప్రకారం పూర్తి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు యుద్ద ప్రాతిపదికన ప్రారంభించామని తెలిపారు. రెండేళ్లలో ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాస్ట్ బెనిఫిట్ రేషియా చూసుకుని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ కాల్వకు రూ. 120 కోట్లు మంజూరు చేశాం.. త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.






