ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్
23-04-2026 04:49 PM
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల నిరసనలో(TGSRTC strike) ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేటలో డ్రైవర్(RTC Driver) శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తక్షణమే అప్రమత్తమైన కార్మికులు శంకర్ గౌడ్ ను ఎంజీఎంకు తరలించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.






