23 April, 2026 | 5:44 PM

వన్యప్రాణుల క్రమ శిక్షణ

23-04-2026 04:30 PM

జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తాళ్ళపేట అటవీ రేంజ్‌లోని తానిమడుగు బీట్‌లో ఏర్పాటు చేసిన సోలార్ బోర్ వెల్ వద్ద అర్ధరాత్రి సమయంలో అడవి జంతువులు క్రమశిక్షణతో వరుసగా నీరు తాగుతున్న దృశ్యంను అక్కడ అమర్చిన కెమెరా ట్రాప్‌ చేసింది. ఈ నెల 22న తెల్లవారుజామున 01:45 గంటలకు ఈ దృశ్యం రికార్డు అయింది. జంతువులు ఒకదాని తర్వాత ఒకటి ప్రశాంతంగా నీరు తాగడం వాటి సహజ ప్రవర్తనను ప్రతిబింబిస్తోంది. అడవిలో నీటి వనరుల సమృద్ధి, సంరక్షణ చర్యలు సమర్థంగా నిర్వహిస్తుండటంతో వన్య ప్రాణుల మనుగడ సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.