20 April, 2026 | 8:41 PM

అతిపెద్ద మానవతప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

20-04-2026 07:32 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీ స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎల్ అండ్ టీ అతిథిగృహంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల కార్యాచరణపై నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ఇవాళ్టి కార్యక్రమం మేం చాలా రోజుల క్రితమే నిర్ణయించకున్నాదని, బీఆర్ఎస్ వాళ్లు సభ పెట్టుకున్నారని మేం టూర్ పెట్టుకున్నామనేది సరికాదని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మానవతప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అని, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమే అతిపెద్ద తప్పు నిర్ణయం అని ఉత్తమ్ తెలిపారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చటం వల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని, రూ.34 వేల కోట్ల ప్రాజెక్టు రూ.లక్ష కోట్లకు చేరి రాష్ట్రానికి భారమైందన్నారు. తుమ్మిడిహట్టిని ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా వైఎస్ఆర్ చెపట్టారని, దీనిని అలాగే కొనసాగించి ఉంటే నిధులు కేంద్రమే ఇచ్చేదాని నిటిపారుదల మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీల కిందనే రూ.16 వేల కోట్లు చెల్లించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.