23-02-2026 12:37:30 AM
చిన్నంబావి, ఫిబ్రవరి 22: మండల కేంద్రంలో దివ్యాంగులకు మంజూరైన రెండు రెట్రో ఫిట్టెడ్ స్కూటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు,వనపర్తి జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు ఎస్.భాను కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి,అన్ని రంగాలలో అభివృద్ధి చెందటమే లక్ష్యమన్నారు.మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ జడ్పిటిసి పరమాల బాలకిష్టయ్య కుటుంబాన్ని మంత్రి పరమర్శించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
గ్రామంలో ఇటీవల మరణించిన ఆకుల నరసింహ,మల్లీశ్వరీ కుటుంబాలను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం గంగపుత్ర సంఘం భవన నిర్మాణనికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు.చిన్న మారూర్ గ్రామంలో ఇటీవల గుండె పోటుతో మరణించిన పింజారి బాలపీర్ (35) కుటుంబాని మంత్రి పరామర్శించి మనోధైర్యం ఉండాలని,బాధిత కుటుంబాని ఆదుకుంటామని దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, రామచంద్రారెడ్డి, కళ్యాణ్ కుమార్,బీచుపల్లి యాదవ్, చిదంబర్ రెడ్డి,కృష్ణ ప్రసాద్ యాదవ్, టాకరెడ్డి,తేజ రెడ్డి, కురుమూర్తి, రామస్వామి, విమలెంక శివుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు.