12-10-2025 07:34:52 PM
చేగుంట: మెదక్ లో జరిగినటువంటి డీసీసీ అధ్యక్షత పదవి గురించి విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ఏఐసీసీ మెదక్ జిల్లా అబ్జర్వర్ జ్యోతి రోటేలాని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ ఛైర్మెన్ రెడ్డిపల్లి తాడేం వెంగళరావు,మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరీ శ్రీనివాస్, యువజన అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ ఎంపీటీసీ బాలనరసయ్య, జింక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.