క్రేన్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్
శంకర్ పల్లి లో జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
శంకర్ పల్లి:(విజయక్రాంతి): శంకర్ పల్లి మండలం మహాలింగ పురం గ్రామ శివారుల్లోని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ(Gaddam Nagarjuna Construction Company) ఫ్యాబ్రికేషన్ కంపెనీలో జరిగిన ఘటన బాధాకరమని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkatswamy) అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలోని మహాలింగాపురం లో ఉన్న ఎన్సీసీ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈదురు గాలులు భారీ వర్షానికి క్రేన్లు కూలడంతో ప్రమాదం జరిగిందన్నారు. అప్పటికే షెడ్డులో వర్షానికి తలదాచుకుంటున్న 17 మంది కార్మికులు బలయ్యారని అన్నారు.
వీరిలో ఘటనాస్థలిలో ఇద్దరు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు .ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన మంగళవారం ఉదయం పరామర్శించారు కంపెనీ వారితో మాట్లాడి మృతుల కుటుంబాలలో ఒకరికి శాశ్వత ఉద్యోగం వచ్చేలా చర్చలు జరుపుతున్నామని శాశ్వతంగా మృతులకు వేతనం వచ్చేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే తెలిపింది అన్నారు. ప్రభుత్వం నుంచి వారికి అండగా ఉంటామన్నారు. శతగాత్రుల వైద్యం పూర్తయ్యే వరకు ఖర్చులను కంపెనీ భరిస్తుంది అన్నారు.






