28 April, 2026 | 1:52 PM

Breaking News

నకిలీ బంగారంతో బ్యాంకు రుణం   •   ఏ రైతును కలవని కేసీఆర్‌కు.. ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పిందెవరు?   •   పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు   •   మహబూబాబాద్‌లో దారుణం.. కుమారులను చంపి తండ్రి ఆత్మహత్య   •   గూగుల్‌ రాక ఏపీకి గేమ్‌ ఛేంజర్‌   •   విశాఖపట్నం ఇక నుంచి AI పట్నం.. దక్షిణాదిపై అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు   •   ప్రజల ఆశీస్సులతో మళ్ళీ పునః జన్మ దక్కింది   •   క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై నిరసన.. ఆటోను తాడుతో లాగిన సీఐటీయూ నాయకులు   •   పెట్రోల్, డీజిల్ సరఫరాపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన   •  

ప్రజల ఆశీస్సులతో మళ్ళీ పునః జన్మ దక్కింది

28-04-2026 11:57 AM

తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల  సోమయ్య

ఖమ్మం,(విజయక్రాంతి): ఇటీవల పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బత్తుల సోమయ్య దంపతులు అంటూ.. ఆ ప్రమాదం సందర్భంగా జరిగిన చికిత్స అనంతరం ప్రతీ ఒక్కరి నోటి నుంచి వెలువడిన మాట ఇది. కాగా ఆ రోడ్డు ప్రమాదం తాలుకు స్మృతులను నెమరు వేసుకుంటున్న బత్తుల సోమయ్య..

తనను కలిసిన విలేకర్లతో ప్రమాదానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ.. ఇది తనకు పునర్జన్మ అంటూ వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జైనప్పటికీ ప్రాణాలతో బతికి బట్టకట్టడం అసాధ్యం అయినప్పటికీ తాను తన సతీమణి క్షేమంగా ప్రస్తుతం ఉండడానికి కారణం జర్నలిస్టులు, వైద్యులే ప్రధాన కారణమని అన్నారు. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో తన ఆప్తమిత్రులైన జర్నలిస్టులు రమణ, రజాక్, నర్సింహారావు, స్థానిక రైతులు హుటా హుటీన రావడంతోపాటు తనకు ప్రథమ చికిత్స చేయడం తనకు ధైర్యం చెప్పడం.. వెంటవెంటనే అంబులెన్స్ తెప్పించడం.. ఆస్పత్రికి తరలించడం జరిగిపోయాయని ఇంతే వేగంగా భవాని ఆర్తో హాస్పిటల్ వైద్యులు రవికుమార్ గౌడ్, ఆస్పత్రి సిబ్బంది తనకు తన భార్యకు చికిత్స చేయడం వల్ల తానిప్పుడు ఇలా ఉన్నానని అన్నారు. తనకు ప్రమాదం జరిగిన సమాచారం యావత్ తెలంగాణ ఉద్యమకారులకు తెలియడం.., వారంతా ఆస్పత్రికి తరలి రావడంతో ఆస్పత్రి ఆవరణమంతా వారితో నిండిపోయిందని అన్నారు.

అందరు ఆందోళనగా తనకోసం ఎదురు చూడడం ప్రత్యేకంగా ప్రార్థనలు, పూజలు చేయడం కూడా తనకు ఈ ప్రమాదం నుంచి తప్పించిందని అన్నారు. ఆ తరువాత ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం వెల్లువెత్తిన డాక్టర్లు, లాయర్లు, ఉద్యమకారులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు, ఇంటికి వచ్చిన అనంతరం తనను పరామర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రాం, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, గద్దర్ కుమారుడు సూర్యం, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, వివిధ సంఘాల, వివిధ పార్టీల నాయకులు తరలి రావడంపై బత్తుల సోమయ్య కృతజ్ఞతలు ప్రకటించారు. ప్రజల్లో మమేకమై.., ప్రజల సమస్యల సాధనకు నిత్యం తపించే తన లాంటి ఉద్యమకారులకు ఈ యాక్సిడెంట్ తాత్కాలికంగా తన కార్యక్రమాలను విరామం కలిగించవచ్చు గాకా.. నిరోధించలేదని ప్రకటిస్తూ... పూర్తిగా ఆరోగ్యం కుదుట పడిన అనంతరం ప్రజా క్షేత్రంలో మరోసారి పునరంకితం అవుతానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన ఆప్తులు సైదులు, భవాని నా పెద్దకూతురు రవిచిత్ర, అల్లుడు వెంకట రెడ్డి, రెండోవ కూతురు భవిత, అల్లుడు సాంబశివరావు, ఇద్దరు చెల్లెళ్లు వనమ్మ, సావిత్రిలు అంబులెన్స్ లో నన్ను ఆస్పత్రికి తరలించేలోగా ఆస్పత్రి బయట నాకోసం ఎదురు చూడడం నేనెప్పటికీ మరువలేనని అన్నారు. అదే విధంగా ఆస్పత్రి వైద్యులు రవికుమార్ గౌడ్ నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ చేసిన వైద్యం ఇంత పెద్ద ప్రమాదం నుంచి తనను ప్రాణాలతో రక్షించగలిగిందని.., ఈ సందర్భంగా వారందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రకటించారు బత్తుల సోమయ్య.