2 July, 2026 | 12:21 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

పాలమూరు ప్రాజెక్టు పనుల పరిశీలనకు మంత్రుల రాక

24-09-2024 01:45 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పనుల బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ తదితరులు పరిశీలించనున్నారు. మంత్రులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన చెందుకు షెడ్యూల్ ఖరారైంది. రేపు ఉదయం 9 గంటలకి జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్, అనంతరం గట్టు మండలంలోని నల్ల సోమనాద్రి గట్టు రిజర్వాయర్, కొత్తకోటలోని శంకర సముద్రం రిజర్వాయర్, కొల్లాపూర్ మండలం ఎల్లూరు, నార్లాపూర్, బిజినపల్లి మండలం వట్టెం పంపింగ్ స్టేషన్ వద్ద నిర్మాణం అవుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను సందర్శించి అక్కడే సమీక్షించనున్నారు.