1 September, 2026 | 11:01 PM

Breaking News

చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •   ఎస్ఆర్ఐ పరిశీలించిన శ్రీ హరి రావు   •  

హెలికాప్టర్ లాండింగ్ సమయంలో స్వల్ప అగ్నిప్రమాదం

19-04-2025 | 01:46pm

- అప్రమత్తమైన పోలీసులు.

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అవగాహన సదస్సు నేపద్యంలో హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి శనివారం నాగర్ కర్నూల్ జిల్లాకు హెలికాప్టర్ ద్వారా హాజరయ్యారు.  కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.  పరిసరాల్లో ఎండు గడ్డిపై నిప్పురవ్వ రాలడంతో మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలని ఆర్పారు. ఫైర్ సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది తలెత్తింది.