మైనర్ బాలిక ఆచూకీ లభ్యం
గద్వాల టౌన్ ఏప్రిల్ 15ఇంటి నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలిక రుత్విక ఆచూకి లభ్యమవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.గద్వాల పట్టణంలో కొద్ది రోజులుగా ఆచూకి లేక ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ బస్టాండ్ ప్రాంతంలో రుత్విక ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ప్రస్తుతం మైనర్ బాలిక సురక్షితంగా ఉన్న ట్లు పోలీసులు తెలిపారు.ఈ విషయంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ రుత్విక క్షేమంగా తిరిగి లభించడం తమకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని,త్వరలోనే ఇంటికి తీసుకువస్తామని పట్టణ ఎస్త్స్ర కళ్యాణ్ కుమార్ పేర్కొన్నారు.






