16 April, 2026 | 3:27 AM

బీసీ రిజర్వేషన్లు వచ్చుడో చచ్చుడో

16-04-2026 01:51 AM

మహిళా జేఏసీ నాయకురాలు మట్ట జయంతి గౌడ్

ముషీరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వస్తున్న నేపథ్యంలో బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా(సబ్ కోటా) కల్పించాలని బీసీ మహిళా జేఏసీ నాయకురాలు మట్ట జయం తిగౌడ్  డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం ఇక్కడ ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

’బీసీ మహిళలకు న్యాయం జరగాలి, లేకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని ఆమె స్పష్టం చేశారు. దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

మాజీ మంత్రి శ్రీని వాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బాలగోని బాలరాజ్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ  ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, రామన్ గౌడ్, చాపర్తి కుమార్, గాడ్గే, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ తదితరు లు పాల్గొన్నారు. గురువారం జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశం ప్రాధాన్యతగా చర్చకు రావాలని, బీసీ మహిళలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.