2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

హాస్టల్‌లో మైనర్ల కామ క్రీడలు.. ఘటనలో పోలీసుల దూకుడు

13-03-2026 12:55 AM
  1. మైనర్ బాలికకు అక్రమ అబార్షన్‌పై 

సాయి కృప ఆస్పత్రి యజమాని సహా ముగ్గురు అరెస్ట్

కొల్లాపూర్, మార్చి 12: జిల్లాలోని హాస్టల్లో ఇద్దరు మైనర్లు కామ క్రీడల్లో మునిగితేలిన ఘటనలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గర్భం దాల్చిన మైనర్ బాలికకు అక్రమంగా అబార్షన్ చేసిన కొల్లాపూర్ సాయికృప ఆస్పత్రి యాజ మాన్యంతో పాటు అందులోని వైద్యురాలు సహా ఉద్యోగితో సహా ముగ్గురిని అరెస్టు చేస్తూ కోర్టు అనుమతితో రిమాండ్ కు తరలించారు. పోలీసు అధికా రులై ఫిర్యాదు మేరకు వైద్య అధికారులు రంగంలోకి దిగి ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు.

ప్రధాన నిందితుడిగా ఉన్న ఆస్పత్రి యజమాని శ్రీనివాసులు కొండ శెట్టిని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం సేకరించారు. గైనకాలజిస్ట్ భవ్య శ్రీ, సిబ్బంది స్వాతిలు కూడా పాత్ర దారులుగా గు ర్తించి కోర్టు ముందు హాజరు పరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

అనంతరం వారిని మహబూబ్నగర్ జైలుకు తరలించారు.ఈ కేసును సవాల్గా తీసుకుని నాగర్ కర్నూల్ డిఎస్పీ బు ర్రి శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్ సిఐ కె. మహేష్, స్థానిక ఎస్‌ఐ బండారు సురేష్ ఆధారాలను సమగ్రంగా సేకరించి కోర్టుకు సమర్పించడంతో నిందితులు అరెస్టయ్యారని తెలిపారు.అయితే ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రి సీజ్ అంశంపై వైద్యశాఖ అధికారులు తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.