23-04-2025 12:00:00 AM
జిల్లా సైన్స్ అధికారి మధుకర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి):సైన్స్‌తో అద్భుతాలు సాధిం చవచ్చని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అటల్ టింకరింగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రా మ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పిల్లలు నేర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో ఉపయోగించుకొని కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
వేసవి కాలంలో మహనీయుల పుస్తకాలు అధ్యయనం చేయాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు డీఎస్‌ఓ ప్రశంస పత్రాలు అం దించారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యు లు కోటేశ్వరరావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దేవభూషణం, కార్యనిర్వాహక కార్యదర్శి రాధా కృష్ణచారి, పాఠశాల కార్యదర్శి వేణుగోపాల్, సహా కార్యదర్శి భోగ మధుకర్, శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.