calender_icon.png 12 May, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధి హామీ కార్మికులు మృతి

12-05-2025 09:22:30 AM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతిచెందారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న మహిళలను వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అక్బర్ పేట- భూంపల్లి మండలం(Akberpet-Bhoompally Mandal) పోతారెడ్డిపేట వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉపాధి కూలీలు(Employed labourers) చంద్రవ్య, దేవవ్య అక్కడికక్కడే మృతి చెందారు. న్యాయం చేయాలంటూ గ్రామస్థులు జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.