23-04-2025 12:00:00 AM
పరిపాలనా అనుమతులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో విద్యుత్ సబ్సిడీ బడ్జెట్ రూ.11,500 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం (ఇంధన శాఖ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్, ఇతర రంగాలకు ఇస్తున్న సబ్సిడీలన్నింటికీ సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని డిస్కంలకు ప్రతి నెలా రూ.958.33 కోట్ల చొప్పున చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.