calender_icon.png 12 May, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా భూమి మాకు కావాలి...!

12-05-2025 10:19:37 AM

ప్రజావాణికి పాదయాత్రగా యువ రైతు దంపతులు. 

 నాగర్ కర్నూల్, విజయక్రాంతి: తమ భూమి కబ్జాకు గురైందని ఎన్నో మార్లు మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ తమ గోడు వినట్లేదని నిరసిస్తూ యువ రైతు దంపతులు ప్రజావాణి వద్దకు పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool district) బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లట్టుపల్లి గ్రామ శివారులోని 253 సర్వే నెంబర్లో సుమారు 11 ఎకరాల భూమికి గాను గతంలో ఆరు ఎకరాలు, మరో 2ఎకరాలు గత 20ఏళ్ల క్రితం అమ్ముకున్నారు.

మిగిలిన 3ఎకరాలు వారసత్వంగా గ్రామానికి చెందిన రాట్లావత్ రవి, గీత దంపతులు చెందినది ఉన్నది. కాగా మరో ఎకరం పొలంలో ఇతరులు కబ్జా చేశారని మండల తహసీల్దార్, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులకు కూడా మోర పెట్టుకున్నామని సర్వే చేయించి హద్దు రాళ్లను పాతినా భూ కబ్జా దారులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదని నిరసిస్తూ సోమవారం తమ గ్రామం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజవాణికి పాదయాత్ర చేపట్టారు.