calender_icon.png 12 May, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో భారత్-పాకిస్థాన్ డీజీఎంవోల చర్చలు

12-05-2025 11:40:50 AM

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ డీజీఎంవోల చర్యలు(India Pakistan DGMO Talksకాసేపట్లో ప్రారంభం కానున్నాయి. భారత్-పాక్ ఘర్షణల దృష్ట్యా హాట్ లైన్ లో డీజీఎంలోల చర్చలు జరగనున్నాయి. భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి చర్చల్లో పాల్గొనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించే అవకాశముంది. కాల్పుల విరమణ అవగాహన ఈనెల 10న ఇరుదేశాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంఓకు హాట్ లైన్ లో భారత్ సందేశం ఇవ్వనుంది. ఘటనలు పునరావృతమైతే తగినరీతిలో జవాబిస్తామని స్పష్టమైన సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరపాలని ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి.