29-05-2025 12:00:00 AM
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘మిరా య్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మి స్తున్నారు.
మనోజ్ మంచు ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘జరగబోయేది మారణహోమం.
శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు’ అంటూ సాగే సాధువు వాయిస్‌తో ప్రారంభమైందీ టీజర్. తిరుగులేని శక్తి కలిగి వినాశక మార్గాన్ని పెట్టే ది బ్లాక్ స్వోర్డ్‌గా మంచు మనోజ్ ఎంట్రీ ఆకట్టుకుంది. డార్క్ పవర్స్ కలిగిన యాంటీ హీరోగా మంచు మనోజ్ కనిపించారు.
మరోవైపు ‘ఈసారి జోక్యం చేసుకునేది దేవతలు కాదు, వారి ఆయుధం.. మిరాయ్. 9 బుక్స్.. 100 క్వశ్చన్స్.. 1 స్టిక్.. బిగ్ అడ్వెంచర్’ అంటూ సూపర్ యోధగా తేజ సజ్జా ఎంట్రీ అదిరిపోయింది. , రితికా నాయక్, శ్రియా శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో ఆకట్టుకోనున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి; కెమెరా: కార్తీక్; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.