29-05-2025 12:00:00 AM
వినూత్న కథలతో ఆకట్టుకునే గుణశేఖర్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ‘యుఫోరియా’ అంటూ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విఘ్నేశ్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా, ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తున్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్ప లత, సాయిశ్రీనిక రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవిప్రకాశ్, నవీనారెడ్డి, లిఖిత్ నాయుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాలో సమకాలీన అంశాలను చూపించబోతున్నారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో జయదేవ్ నాయర్ పాత్ర పోషిస్తున్న ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్యారెక్టర్‌కు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ; డీవోపీ: ప్రవీణ్ కే పోతన్; ఎడిటర్: ప్రవీణ్ పూడి.