1 July, 2026 | 9:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై దర్యాప్తు జరపాలి-

26-05-2025 01:00 AM

- స్త్రీని శక్తిగా పూజించే తెలంగాణ గడ్డపై ఇలాంటి సంఘటనలకు చోటులేదు-

- యావత్ తెలంగాణ సమాజం తరఫున ఆమెకు క్షమాపణలు 

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): తనను వేధించారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

మహిళలను గౌరవించి, ఆరాధించే గొప్ప సంస్కృతి కలిగిన తెలంగాణ గడ్డపై మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవం తనను ఎంతో బా ధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మే రకు ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ మహిళకు ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

యావత్ తెలంగాణ సమాజం తరఫున మిల్లా మాగీకి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాన ని కేటీఆర్ తెలిపారు. మహిళలకు సమాన అ వకాశాలు కల్పించడాన్ని సంప్రదాయంగా భావించే తెలంగాణకు, రాణి రుద్రమ, చి ట్యాల ఐలమ్మలే నిత్యస్ఫూర్తి ప్రదాతలు అని కేటీఆర్ అన్నారు.

మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎ దిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలన్నారు. మిల్లా మాగీ చూపిన తెగువ అభినందనీయమని, ఈ  భయంకర అనుభ వం నుంచి ఆమె త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. మిల్లా మాగి చేసిన ఆరోపణలపై విచారణ జరపకుండా ఆమెనే దోషిగా నిలబెట్టాలనుకుంటున్న ప్రభుత్వ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మిల్లా మాగీని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.