1 July, 2026 | 8:03 PM

Breaking News

ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •  

మత్స్య సహకార సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి

26-05-2025 12:59 AM

బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్, మే 25(విజయ క్రాంతి): మత్స్య సహకార సంఘం అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 -జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్ సి ఎస్ కన్వెన్షన్ నందు నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు జీవం పోస్తూ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికాభివృద్ధిని అందించి, మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఫిషరీస్ కో- అపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ సుకీర్తి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జీడిమెట్ల శాఖ అధ్యక్షులు చిలుకూరి కృష్ణ, ఉపాధ్యక్షురాలు చిలుకూరి యాదమ్మ, ప్రధాన కార్యదర్శి మద్దూరి వీరేష్, డైరెక్టర్లు తాళ్ల వెంకటేష్, మన్నె శంకర్, అరికల లక్ష్మణ్, మద్దూరి సత్తెమ్మ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులుపాల్గొన్నారు.