25 August, 2026 | 6:41 PM

భార్యతో గొడవ.. ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త

25-08-2026 06:04 PM

ఉప్పల్,(విజయక్రాంతి): భార్యతో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్ రాష్ట్రానికి చెందిన అరుణ్ కుమార్ రౌత్ (45), తండ్రి సాగర్ రౌత్, కూలీ పనులు చేస్తూ తన భార్య, పిల్లలతో కలిసి ఉప్పల్‌లోని చిలకానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 3వ తేదీన సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో తన భార్య రూబీ దేవితో జరిగిన గొడవ అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అయితే, వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య రూబీ దేవి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణ్ కుమార్ రౌత్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.