30-10-2025 08:55:06 AM
అధికారుల సహాయక చర్యల విఫలంపై సర్వత్రా విమర్శలు.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూలు గ్రామ పరిసరాల్లోని నాగసముద్రం వాగు(Nagasamudram stream) ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా ఒకరు అతి కష్టం మీద సురక్షితంగా బయటపడగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్(45), పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇరువురూ నాగనూలు నుండి నాగర్ కర్నూల్ పట్టణానికి వచ్చేందుకు వాగు దాటుతుండగా ఇద్దరూ గళ్లంతయ్యారు.
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం అధికారులు ఎలాంటి సహాయక చర్యల్లో చేపట్టకపోవడంపై బంధువులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు బంధువులు గల్లంతైన వరద ప్రాంతంలోనే ఆచూకీ కోసం గాలించగా గల్లంతైన ప్రదేశం నుంచి ఐదు అడుగుల దూరంలో చెట్టుకు ఇరుక్కొని కనిపించారు. మృతదేహాన్ని స్థానికులు బయటికి తీశారు. గల్లంతైన సమయంలో అధికారులు స్పందించి ఉంటే వ్యక్తి బ్రతికి బయటపడేవాడని కుటుంబ సభ్యులు స్థానికులు వాపోయారు.