11 August, 2026 | 1:50 AM

మిఛెల్ మార్ష్ అరుదైన రికార్డు

11-08-2026 12:00 AM

లండన్, ఆగస్టు 10: ఆస్ట్రేలియా స్టార్ బ్యటర్ మిచెల్ మార్ష్ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాదిలో 1500 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసీస్ బ్యాటర్గా రికా ర్డులకెక్కాడు. హండ్రెడ్ 2026 టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మార్ష్ తాజాగా వెల్ష్ ఫైర్తో జరిగిన మ్యాచ్లో 34 బం తుల్లో 50 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు టి మ్ డేవిడ్ పేరిట ఉండేది. 2022లో అతడు 1461 పరుగులు చేశాడు. 2024లో ట్రావిస్ హెడ్ 1442 పరుగులతో టిమ్కు దగ్గరగా వచ్చాడు.

ఈ ఏడాది ఇప్పటివరకు 35 మ్యా చ్లు ఆడిన మార్ష్.. 44.17 సగటున, 160 స్ట్రైక్రేట్తో, రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సాయంతో 1502 పరుగులు చేసి టిమ్ డేవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. మార్ష్ అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరఫున, బిగ్ బాష్ లీగ్లో పెర్త్ స్కార్చర్స్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, ది హండ్రెడ్లో సన్రైజర్స్ లీడ్స్ తరఫున ఆడుతూ ఈ పరుగులు సాధించాడు. ఈ ఏడాది టీ20ల్లో 1500 పరుగులు సాధించడంతో మార్ష్ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సరసన చేరాడు. విరాట్ 2016లో 1614 పరుగులు చేయగా.. ఏబీడీ 2019లో 1580 పరుగులు చేశాడు.