calender_icon.png 13 February, 2026 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెకు మిశ్రమ స్పందన

13-02-2026 12:26:15 AM

  1. తమిళనాడు, కేరళ, ఒడిశాలో దేశవ్యాప్త సమ్మె సక్సెస్

మిగతా రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి12: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను నిరసిస్తూ 10 ట్రేడ్ యూనియన్ల ఉమ్మడి ఫోరం గురువారం నిర్వహించిన దేశవ్యాప్తంగా బంద్‌కు మిశ్రమ స్పందన కన్పించింది.

దేశవ్యాప్త బంద్‌కు మద్దతు తెలుపుతూ.. ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. భారత్ బంద్’కు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఎంపీ పి.సందోష్ కుమార్ చెప్పారు. కేరళ, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బంద్ కొనసాగింది.

అయితే కేరళ, తమిళనాడు, ఒడిశాలో భారీ ఎత్తున బంద్ కొనసాగింది. మిగతరా రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వచ్చినట్లు సమాచారం. ఈ బంద్ వల్ల బ్యాంకులు, రవాణా, ఇతర సేవలతో సహా అనేక సౌకర్యాలకు అంతరాయం కలిగినట్లు సమాచారం. అయితే ‘భారత్ బంద్ మరో కేరళ బంద్ మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.

నాలుగు కార్మిక చట్టాలను, నియమాలను రద్దు చేయాలని, ముసాయిదా విత్తన బిల్లును ఉపసంహరించు కోవాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ను పునరుద్ధరించాలని, విక్షిత్ భారత్  రోజ్గార్, అజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం 2025 ను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.