24 August, 2026 | 1:19 AM

డివాఫిల్ కేఫ్ 6వ శాఖ ప్రారంభం

24-08-2026 12:29 AM

హెడ్ ఆఫీస్‌గా రూపుదిద్దుకున్న మియాపూర్ బ్రాంచ్  

ఫ్రాంచైజీలకు ఆహ్వానం - ఎస్.ప్రణయ్

హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రుచికరమైన శాకాహార వంటకాలు, ఆకర్షణీయమైన డెజర్ట్స, ప్రత్యేకమైన పానీయాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న డివాఫిల్ కేఫ్ తన 6వ శాఖను మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఘనంగా ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌ను డివాఫిల్ కేఫ్ యజమాని, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. ప్రణయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ బస్స్టాప్ వెనుక భాగంలో అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ కేషను ప్రేమ్ రాజ్ కళ్యాణి ప్రారంభించి, నిర్వాహకులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రమ్ రాజ్ రవికాంత్, ఎస్. శిరీషతో పాటు కుటుంబ సభ్యులు ఎస్. పర్ణిత, ఆయుష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రముఖ డిజిటల్ క్రియేటర్, ఫుడ్ బ్లాగర్ సౌమ్య ఎడిగ ముఖ్య అతిథిగా హాజరై డివాఫిల్ కేఫ్ 6వ శాఖ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

యువత నుంచి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన శాకాహార రుచులను ఆస్వాదించాలనే ఉద్దేశంతో డివాఫిల్ కేఫ్‌ను విస్తరిస్తున్నాం అని నిర్వాహకులు తెలిపారు.ప్రతి వంటకాన్ని తాజా పదార్థాలతో, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. మియాపూర్‌లో ప్రారంభమైన ఈ 6వ శాఖను డివాఫిల్ కేఫ్ హెడ్ ఆఫీస్‌గా కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. డివాఫిల్ కేఫ్ బ్రాండ్తో వ్యాపారం చేయాలనుకునే ఔత్సాహికులకు ఫ్రాంచైజీ అవకాశాలను కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేఫ్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునే వారు మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని డివాఫిల్ కేఫ్‌ను సందర్శించి ఫ్రాంచైజీ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.