24 August, 2026 | 4:01 AM

నైకీ ట్రేడర్స్ రూ.28 కోట్ల మోసం!

24-08-2026 01:18 AM
  1. బంగారం, వెండిపై పెట్టుబడి పేరుతో దగా 
  2. మొదట చిన్న మొత్తాలతో.. తర్వాత భారీగా డిపాజిట్లు
  3. బోర్డు తిప్పేసిన సంస్థ నిర్వాహకులు
  4. జహీరాబాద్‌లో 27 మంది బాధితులు
  5. నలుగురు నిందితుల అరెస్టు

జహీరాబాద్, ఆగస్టు 23: నైకీ ట్రేడర్స్’ అనే సంస్థ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా బంగారం, వెండి ట్రేడింగ్ పేరుతో దాదాపు రూ. 28 కోట్లకు పైగా భారీ మోసానికి పాల్పడింది. మొదట చిన్న మొత్తాలతో.. తర్వాత భారీగా డిపాజిట్లను సేకరించింది. చివరకు సంస్థ నిర్వాహ కులు బోర్డు తిప్పేశారు. దాదాపు రూ.100 వరకు ఈ స్కాం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. జహీరాబాద్‌కు చెందిన 27 మంది బాధితుల ఫిర్యాదు తో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసు లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ టౌ న్ సీఐ రవి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబా ద్ పరిసర ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ‘నైకీ ట్రేడర్స్’ అనే సంస్థ భారీ మోసానికి పాల్పడింది. బంగా రం, వెండి వ్యాపారాల్లో పెట్టుబడు లు పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని రీ తిలో భారీ లాభాలు, అధిక వడ్డీలు ఇస్తామని న మ్మిం చారు. వీరి మాటలు నమ్మిన స్థానిక వ్యాపారులు, ప్రజలు తమ కష్టార్జితాన్ని కోట్ల రూపాయ ల రూపంలో నైకీ ట్రేడర్స్ నిర్వాహకులకు అప్పగించారు.

మొదట్లో బాధితులకు నమ్మకం కలి గించేలా కొన్ని తాయిలాలు చూపించిన ఈ సం స్థ, ఆ తర్వాత అసలు రంగు బయట పెట్టింది. బా ధితులు పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన తర్వాత, డబ్బులు తిరిగి చెల్లించకుండా సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆం దోళనకు గురయ్యారు. తాము ఘోరంగా మోస పోయా మని గ్రహించిన బాధితులు మిదిదొడ్డి ఇజ్రాయేల్ అలియాస్ బాబి, కొత్త శశిధర్‌రెడ్డి, నాగరిగారి విల్లీ ప్రిన్సెస్, పోతరాజు అరవిం ద్‌తో పాటు మరో 22 మంది కలిసి జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కుంభకోణం విలువ రూ.28.14 కోట్లకు పైగా తేలింది. అయితే ఈ మోసం విలువ మొత్తం రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

రంగంలోకి పోలీసులు.. నలుగురు అరెస్టు

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రవి నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యా ప్తును వేగవంతం చేశా రు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు, ఈ భారీ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోనే నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో కర్నూ ల్‌కు చెందిన శశివర్ధన్‌రెడ్డి, తిరువూరుకు చెందిన రవీంద్రబాబు, విజయవాడకు చెందిన జగదీష్, అమలాపురంకు చెందిన సుస్మిత పిండి ఉన్నట్లు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.