29 April, 2026 | 10:38 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ

29-04-2026 09:19 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించారు. బుధవారం విడుదల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబా-పూలే BC సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులు 100% ఉత్తీర్ణతతో తను ప్రతిభను చాటారు. చింతల శ్రీజ 581 మార్కులతో  మొదటి సానం ఉండగా, వరుసగా కోట అక్షయ - 566 ,చండె స్వాతి- 565, తాళ్ళపల్లి సహస్ర - 560, గుమ్మడి వైష్ణవి - 555 మొదటి 5వ స్థానాల్లో ఉన్నారు. మొత్తం 34 మంది విద్యార్థినులు 500 లకు పైగా మార్కులు సాధించారనీ ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా టెన్త్ ఫలితాల్లో అత్యున్నత ప్రతిభను చాటిన విద్యార్థినులను ఆర్సీ ఓ శ్రీదర్, ప్రిన్సిపల్ రమాదేవి, ఉపాద్యాయ బృంధం అభినందించారు.