వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే..

06-10-2026 | 05:20pm

అధికారం మనదే అభివృద్ధి చేసి చూపిస్తాం: ఎమ్మెల్యే

బోథ్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadav) పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

పట్టణానికి చెందిన వార్డు సభ్యులు నితీష్ తో పాటు శ్రావణ్ రెడ్డి ,ఆనంద్ ,వివేక్, భోగ సాయితో పాటు మరికొంతమంది యువకులు పార్టీలు చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 శాతం వచ్చేది మన ప్రభుత్వమేనని అయితే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతామన్నారు. పార్టీలో చేరిన వారితో పాటు కార్యకర్తలు చురుకైన పాత్రను పోషించాలన్నారు.

గత ప్రభుత్వంలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యమంత్రిని తిరిగి కెసిఆర్ ను చేసేంతవరకు విశ్రమించవద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి, మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు రాజు రెడ్డి, రూప్ చంద్, సంజయ్, బాబూలాల్ ,అంబాజీ ,మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, తాహెర్బిన్ సలాం ,ఎలుక రాజు, బి డి సి అధ్యక్షులు పోతన్న, సదానంద్ ,పట్టణ అధ్యక్షులు ప్రశాంత్ యూత్ అధ్యక్షులు ప్రవీణ్ ,నాయకులు రాకేష్ రెడ్డి, సంజీవ్ ,రఫీ ,గంగమల్లు ,కటకం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు