అన్నదాతలు దళారులను నమ్మొద్దు
నేరడిగొండలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, మార్చి 9 (విజయక్రాంతి): రైతులు తమ పంటను అమ్ముకునేందుకు దళారులను నమ్మవద్దని బోథ్ ఎమ్మెల్యే అని ల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో పీఏసీఎస్ సొసైటీ ఆవరణలో నాఫెడ్ వారిచే తెలంగాణ మార్కుఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన తొలి రైతు ను సన్మానించారు. ప్రభుత్వాలు రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేపట్టాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిండం లో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, బీఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ నారాయణ రెడ్డి, సుధీర్ రెడ్డి, రవీందర్, రవీందర్, రవి, రాజు, శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




