calender_icon.png 3 December, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప మహా పడిపూజలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు

03-12-2025 09:42:57 PM

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో భక్తి, భవిష్యత్తులను నింపుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఆధ్యాత్మిక వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనేలా చేస్తాయి. భక్తి మార్గం మనిషిని మంచిదారిలో నడిపించే శక్తి కలిగి ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఉదయ్ కుమార్ సాగర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మహా పడిపూజలో చింత సాయినాథ్, రవికుమార్ సాగర్, అభయ్ కుమార్ సాగర్, గోవర్ధన్ నాయక్, జీవి శ్రీనివాస్ తదితరులు పాల్గొని అయ్యప్పస్వామి ఆశీస్సులు పొందారు.