calender_icon.png 3 December, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజేబుల్డ్ ఇంటర్నేషనల్ డే పురస్కరించుకొని ఎవేర్నెస్

03-12-2025 09:58:00 PM

మేడిపల్లి (విజయక్రాంతి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ గణేష్ నగర్ చైల్డ్ గైడెన్స్ సెంటర్ (సిజిసి) ప్రిన్సిపాల్ డీ రజిని ఆధ్వర్యంలో డిజేబుల్డ్ ఇంటర్నేషనల్ డే పురస్కరించుకొని అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రజని మాట్లాడుతూ.. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈసారి డిజేబుల్డ్ డే అవేర్నెస్ కోసం గణేష్ నగర్ నుండి మేడిపల్లి పోలీస్ స్టేషన్ మీదుగా మా విద్యార్థినీ విద్యార్థులు స్టాప్ తో కలిసి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మేడిపల్లి పోలీసు వారు మా విద్యార్థిని విద్యార్థులను అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవాణి, సంస్థ ప్రధాన కార్యదర్శి జాయినీ రోజ్ కుమారి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 52 సంవత్సరాలుగా సిజిసి అనే విత్తనం పెట్టి భారీ వృక్షంగా తయారుచేసి, సుమారుగా ఈరోజు 170 మంది మానసిక అంగవైకల్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చి 10 ప్లస్ 2 ఇంటర్ వరకు చదివించి ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దడం జరుగుతుందని తెలియజేశారు.

అదేవిధంగా రాబోయే మూడు రోజులు వారోత్సవాలలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని అవేర్నెస్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ కార్యక్రమానికి మేడిపల్లి పోలీసు వారితో పాటు పలువురు రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిజిసి సెంటర్ విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్టాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.