calender_icon.png 24 February, 2026 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

24-02-2026 12:28:49 AM

గుండాల, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని రైతు వేదికలో సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి - సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. యాభై నాలుగు మంది లబ్ధిదారులకు రూ. 54,06,264 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు, ముగ్గురు లబ్ధిదారులకు రూ. 1,20,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేకూరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్కే ఖాసీం, ఎంపీడీవో బాలరాజు, దామరతోగు సర్పంచ్ కల్తి కృష్ణారావు, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు, సాయనపల్లి సర్పంచ్ కల్తి కృష్ణవేణి, శంభునిగూడెం సర్పంచ్ ఈసం సుమలత, శెట్టుపల్లి సర్పంచ్ డిల్లీ వసంత రావు, పీఎస్‌ఆర్ - పీవీ ఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ మండల కో-ఆర్డినేటర్ ఎస్కే ఖదీర్, ఏఎంసీ డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, మండల సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, ఎస్కే అబ్దుల్ నభి, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ముత్తాపురం మాజీ ఉప సర్పంచ్ మోకాళ్ళ శంకర్, దామరతోగు మాజీ ఉప సర్పంచ్ కొమరం రమేష్, గుండాల వార్డు మెంబర్లు జాటోత్ వీరన్న, ఈసం చంద్రయ్య, సనప జానకి, కాచనపల్లి వార్డు మెంబర్లు పూనెం లక్ష్మి, ఇస్లావత్ అఖిల, భూక్య బాలాజీ, నాయకులు ఎస్కే కాశీం, ఊకె బాబురావు, బోడ వెంకట్రామ్, నూనావత్ రవి, నూనావత్ నరసింహ, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, పల్లపు రాజేష్, సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.