ఎమ్మెల్యే గారూ.. న్యాయం చేయండి
నెన్నెలలో కాంగ్రెస్ నేత తీరుపై రైతుల వేడుకోలు
బెల్లంపల్లి, జూన్ 16: నెన్నెల మండలంలోని గొల్లపల్లికి చెందిన కాంగ్రెస్ నేత, ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌గౌడ్ నుంచి రక్షణ కల్పించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రైతు బొజ్జం గోపాల్‌రెడ్డి అనే రైతు ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను వేడుకుంటూ వాట్సప్‌గ్రూప్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. నెన్నెల మండలానికి చెందిన ఆదిరెడ్డి అనే వ్యక్తి దగ్గర తాను తొమ్మిది ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిలో 11 ఎకరాల భూమి ఉండగా గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్‌గౌడ్ రెండెకరాలు తనకు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు వాట్సప్‌లో పోస్టు చేశా డు. భూమి ఇవ్వకుంటే రూ.2 లక్షలు ఇవ్వాలని లేదంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో చెప్పి సర్వే చేయించి భూమిని బయటకు తీస్తానంటూ బెరిరించినట్టు పేర్కొన్నారు. డబ్బులు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తే తమ చేనులోని హద్దులు, కొయ్యలు తీసేసి భయాందోళనకు గురి చేశాడని పేర్కొన్నాడు.






