వాక్.. డొనేట్.. రిపీట్
- రక్తదానంపై అవగాహనకు 3కే రన్
- అపోలో ఆస్పత్రి, టీసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): రక్తదానం ప్రాముఖ్యంపై అవ గాహన కలిగించేందుకు అపోలో ఆస్పత్రి, టీసీఎస్ ఆధ్వర్యంలో 3కే రన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అపోలో ఆస్పత్రి సీఈవో తేజస్వీరావు, డైరెక్టర్ డాక్టర్ రవీంద్రబాబు తెలి పారు. ‘వాక్, డొనేట్, రిపీట్’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆది వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చేపట్టిన 3కే రన్‌కు టీసీఎస్ సహకారం అం దించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వాక్, డొనేట్, రిపీట్ నినాదం ప్రజల్లో చైతన్యం తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టీసీఎస్ రీజినల్ హెడ్ చల్ల నాగ్, హైదరాబాద్ హెచ్‌ఆర్ శ్రీకాంత్ సూరంపూడి మాట్లాడుతూ అపోలో చేపట్టిన కార్య క్రమంలో తాము భాగస్వామ్యం కావడం పట్ల హర్షిస్తున్నట్లు చెప్పారు. ఒకరి రక్తదానం పలువురికి ప్రాణదానం అవుతుం దని అపోలో ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ అధిపతి డాక్టర్ సుధారంగనాథన్ అన్నారు. దాదాపు 1,500 మంది టీసీఎస్ ఉద్యోగులు పాల్గొని రక్తదానం పట్ల వారికున్న నిబద్ధత చాటుకున్నారు.






