వాహనదారుడిపై టోల్ సిబ్బంది దాడి
17-06-2024 12:20 AM
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో నాందేడ్‌అకోలా జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ రుసుం చెల్లింపుపై వాహనదారునికి టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహదారుడిపై ఇనుప రాడ్లతో బీహార్‌కు చెందిన టోల్ ప్లాజా సిబ్బంది దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లోకల్ వాహనాలకు కూడా టోల్ రుసుం వసూలు చేస్తున్నారంటూ ప్లాజా సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.






