calender_icon.png 19 December, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్పీని కలిసిన సర్పంచ్ ఆనంద్ నాయక్

19-12-2025 07:52:11 PM

శాంతిభద్రతల పరిరక్షణలో సర్పంచుల పాత్ర కీలకం: డిఎస్పి

తాండూరు,(విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా తాండూర్ డిఎస్పిని పెద్దేముల్ మండలం కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్ మరియు గ్రామస్తులు గోపాల్ నాయక్, రతన్ సింగ్, నితీష్ నాయక్ లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆనంద్ నాయక్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని పోలీసులకు సర్పంచులు సహకరించాలని కోరారు.