కస్టడీ నుంచి పారిపోయిన ఎమ్మెల్యే
03-09-2025 01:14 AM
తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్‌ను అత్యాచారం, మోసం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు ఎమ్మెల్యేను పోలీస్ కస్టడీలో ఉంచగా.. పోలీస్ కస్టడీ నుంచి ఎమ్మెల్యే తప్పించుకుపోయాడు. సనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన హర్మీత్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఆయన సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆరోపణలను ఖండించిన హర్మీత్.. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్ర అని అభివర్ణించారు.




