calender_icon.png 20 February, 2026 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాడెమోసి మిత్రుడి పట్ల అభిమానాన్ని చాటిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

20-02-2026 10:07:33 AM

ఇల్లందు, (విజయక్రాంతి): ఇల్లె౦దు పట్టణ నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, షాలిమార్ బార్బర్ షాప్ వ్యవస్ధాపకులు గుడివాడ నాగేశ్వరరావు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆయన పార్ధీవ దేహనికి పూలమాల వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగఢ సంతాపం తెలిపారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని ఎమ్మెల్యే తన మిత్రుడు కావడంతో  పాడమోసి కడసారి విడ్కోలు పలికారు. కార్యక్రమంలో  స్ధానిక కౌన్సలర్ ఉల్లింగ విజయలక్ష్మీ సతీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జానీ పాషా, మాజీ మార్కెట్ కమిటి చైర్మెన్ భుక్యా నాగేశ్వరరావు, మంచాల ఉదయ్, సంతోష్ విరేందర్ తదితరులు పాల్గోన్నారు.