నాగిరెడ్డిపేటలో సర్ శతశాతం పూర్తయినందున నాయకులకు సన్మానం చేసిన ఎమ్మెల్యే
నాగిరెడ్డిపేట్,జులై 22 (విజయ క్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సర్ కార్యక్రమం మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో బూత్ లెవెల్లో 100% పూర్తి చేసినందున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గ్రామ,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ ఠాగూర్ సాయి గౌడ్లను శాలువతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఇరువురి నాయకులు లక్ష్మణ్ ఠాగూర్,సాయి గౌడ్ మాట్లాడుతూ...తమ కష్టాన్ని గ్రహించి సన్మానించినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ...మండలంలో,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాగిరెడ్డిపేట గ్రామం మాదిరిగా సర్ కార్యక్రమం 100% పూర్తి చేయాలని,లక్ష్మణ్ ఠాగూర్, సాయ గౌడ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ ఈమామ్,నాయకులు ఫారుక్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






