23 July, 2026 | 2:35 AM

కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు మార్గం

23-07-2026 01:28 AM

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): న్యాయం చేయాలని అడిగిన విద్యార్థులపై అమానుషంగా కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి చేయిస్తున్నదని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు మార్గమని మండిపడ్డారు. బుధవారం నిజామాబాదులోని ఆయన నివా సంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజులుగా డిమాండ్ చేస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాపై మాట్లాడకుండా విద్యార్థులను అణగ దొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నాయకుడు రాహు ల్ గాంధీపై అమానుషమైన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం ముమ్మరం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయారు బిన్ ఆమ్దాన్ గారు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపెల్లి గంగారెడ్డి పాల్గొన్నారు.