11 August, 2026 | 1:12 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

అనుచర వర్గంపై ఎమ్మెల్యే దృష్టి...

15-06-2026 01:06 AM

పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు

బోథ్ జూన్ 14 (విజయక్రాంతి): బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ యాద వ్ తన అనుచర వర్గంపై పట్టు సాధిస్తూనే పార్టీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరి స్తూ ప్రభుత్వ అధికార దృష్టికి సమస్యలను తీసుకువస్తూనే ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో పట్టు సడలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతిరోజు ప్రజల్లోనే....

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి జాదవ్ అనిల్ తనదైన శైలిలో ప్రజల్లోకి చొచ్చుకు వెళుతున్నారు. ఉదయం పూట తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడి గ్రామాల వారీగా సమస్యలను తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి అక్కడి ప్రజల జీవన స్థితిగతులను పరిశీలించి వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుండడంతో ఎమ్మెల్యే పైన ప్రజలకు భరోసా పెరగడంతో ప్రతిరోజు వందల సంఖ్యలో కార్యకర్తలు ఎమ్మెల్యే కలిసినందుకు వాస్తు పోతుంటారు. అయితే నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు సడలకుండా ముందుచూపుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుండడంతో మొదట మండలంలోని ముఖ్య నాయకులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. అనంతరం గ్రా మాల వారీగా పార్టీ క్యాడర్ తో సమావేశమై పార్టీలో ఉన్న లోటు పాట్లను పరిశీలిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు అని పరిశీలకులు అంటున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధికి నిధులు రాబట్టి

దాదాపు ఒకటిన్నర దశాబ్దం కాలంగా రాజకీయాలలో ఉంటూ రాజకీయాన్ని ఓంట పట్టించుకోని నియోజకవర్గ అభివృద్ధికి ని ధులను రాబడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తనకు ఉన్న పరిచయాలతో నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలకు ని ధులు రాబట్టడంతో ప్రజల్లో ఆయన పనితీ రు పట్ల విశ్వాసం పెరిగినట్లు అయింది. కార్యకర్తల ఇండ్లలో మంచి చెడులకు వెళుతూ ఉండడంతో కార్యకర్తలు సంతోషాన్ని నింపుతున్నారు.ఓపికగా కార్యకర్తల ఇబ్బందులను వింటూనే గ్రామాలలో ప్రజలతో సత్సంబంధాలు ఉంచుకోవడం వల్ల ఆయన కెరీర్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.