గ్రామ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే కీలక విజ్ఞప్తి

28-09-2026 | 08:04pm

పరశురాంపల్లి గ్రామ తరలింపునకు సానుకూల స్పందన

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే గండ్ర వినతి

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని పరశురాంపల్లి గ్రామ(Parasurampally village) తరలింపు అంశంపై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) తెలిపారు. గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజాభవన్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంత్రులకు వినతిపత్రం అందజేశారు. పరశురాంపల్లి పరిధిలోని ఓసీ-3 బొగ్గు గని కార్యకలాపాల కారణంగా భూములు కోల్పోవడం, బ్లాస్టింగ్‌ ప్రభావంతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడటం, కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

గ్రామ ప్రజల సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరశురాంపల్లిని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కర్‌రావు, చింతిరెడ్డి సమ్మిరెడ్డి, కొడారి బాబు యాదవ్, పలకల రామ్‌రెడ్డి, పెంట రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ ఉడత రవి, ఎర్రం సదానందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు