calender_icon.png 9 February, 2026 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23వ డివిజన్‌లో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల

09-02-2026 02:02:13 AM

ముకరంపుర, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): నగరంలోని 23వ డివిజన్‌లో డి మార్ట్ ఏరియాలో డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి సాగర్ తో కలిసి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంటింటికి వెళ్లి కారు గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత పది ఏళ్లలో బిఆర్‌ఎస్ హయాంలో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులతో డివిజన్ ను జంగిలి సాగర్ అభివృద్ధి చేశారని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్ అభ్యర్థి జంగిలి సాగర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.