calender_icon.png 15 May, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల

12-05-2025 02:59:12 AM

కరీంనగర్, మే 11 (విజయ క్రాంతి): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం  శ్రీరామ భక్త హనుమాన్ సహిత గణపతి దేవాలయంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని  చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమాండ్ల  కమల్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఎమ్మెల్యే గంగుల హాజరై ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి, పారాయణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగులకు  ఆలయకమిటి బాద్యులు, ఘనంగా స్వాగతం పలికారు.పుష్ప గుచ్చాన్ని అందించి శాలువా తో సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మెన్ ఏనుగు రవీందర్  రెడ్డి, అర్బన్ బ్యాంక్  డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, ఆలయ కమిటీ చైర్మెన్ పెరుమాండ్ల  మొండయ్య గౌడ్, గురు స్వాములు  రమణాచార్యులు, తిరుపతిగౌడ్, కమల్ గౌడ్,  సాయికృష్ణ, రాజు, విక్రమ్, కొత్తపల్లి మండల హనుమాన్ మాల దారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.